CTR: రొంపిచర్ల మండలం చిచ్చిలివారిపల్లికి చెందిన వైసీపీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బాలాజీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పీలేరులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయనను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.