ప్రకాశం: దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో ఉన్న గురుకుల పాఠశాలలో టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన నాణ్యత, రుచి, తాగునీటి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. భోజనం బాగాలేకపోతే తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు.