SRCL: ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో ఐకేపీ సెంటర్ కోసం D6 కాలువ పక్కన ఖాళీ స్థలాన్ని కేటాయించాలని గ్రామ పంచాయతీ ప్రతినిధులు MROను కలిసి వినతిపత్రం అందించారు. సర్వేయర్‌తో హద్దులు నిర్ణయించాలని కోరగా, MRO సానుకూలంగా స్పందించి సర్వేకు ఆదేశాలు ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్ కాత మల్లేశం, ఉపసర్పంచ్ కొదని మహేష్ తదితరులు పాల్గొన్నారు.