HNK: ఈద్-ఉల్-ఫితర్ (పవిత్ర రంజాన్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగల్లో ఒకటి రంజాన్ అని కొనియాడారు.