VSP: వీఎంఆర్డీఏ కార్యాలయం, చిల్డ్రన్ ఏరినా, గురజాడ కళాక్షేత్రంలో సందర్శకుల కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి రక్షిత తాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దివిస్ సంస్థ సుమారు రూ. 16 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు చేసిందన్నారు.