ADB: ఈ నెల 30వ తేదీన ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్డు నుంచి స్థానిక ITDA కార్యాలయం వరకు నిరుద్యోగులతో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు డీఎస్సీ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ సందర్బంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనే డిమాండుతో మహాధర్నా నిర్వహించనున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.