NTR: మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని, అకాల వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న రైతులను తప్పకుండా ఆదుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో అకాల వర్షం వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటను వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.