KRNL: హలహర్వి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దేవాలయ భూముల కౌలు వేలం శుక్రవారం జరిగింది. క్షేత్రగుడి ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన 10 ఎకరాలు రూ.1.40 లక్షలకు, హంపి వీరూపాక్షి ఆలయానికి చెందిన 30 ఎకరాలు రూ.3.20 లక్షలకు దక్కాయి. మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆలయ భూమి 28 ఎకరాలు రూ.3.25 లక్షలకు వేలంలో పొందినట్లు గ్రామ పెద్దలు పేర్కొన్నారు.