MNCL: ప్రమాదవశత్తు జారి బండపై పడి తలకు తీవ్ర గాయాలతో ఓ మృతి చెందిన ఘటన జైపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై భూమేష్ వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన సురేష్ (47) అనే వ్యక్తి పని నిమిత్తం మంచిర్యాలకి వచ్చి తిరుగు ప్రయాణంలో STPP పవర్ ప్లాంట్ ఎదురుగా ఖాళీ స్థలంలో జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై మరణించాడు. కేసు నమోదు చేశామని ఎస్సై వెల్లడించారు.