W.G: వినాయక చవితి నిమజ్జనం వేడుకల వేళ తూర్పుతాళ్లులో చోటుచేసుకున్న విషాదకర ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంది. మృతుల కుటుంబాలకు 9 నెలలు తర్వాత సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ప్రమాద బీమా రూ. 3లక్షలు చెక్కులను గురువారం బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అందజేశారు . గత ఏడాది ఆగస్టు నెలలో ఈ ఘోర ప్రమాదం జరిగింది