ATP: తాడిపత్రి పట్టణ పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలమైన గాలులు వీయడంతో రహదారుల పక్కన ఉన్న పెద్ద వృక్షాలు నెలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు వంగిపోవడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.