మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర వడదెబ్బ కారణంగా నలుగురు వృద్ధులు మృతి చెందారు. బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన లచ్చమ్మ (90) కేసముద్రం మండలం కల్వల చెందిన గాదె కొమురమ్మ(90) కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన లింగయ్య (80)నెల్లికుదుర్ మండలం హనుమాన్ నగర్ తండాకు చెందిన అమృత (55) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గురువారం అధికారులు తెలిపారు.