ATP: గ్రామస్థాయి నుంచి 18 లక్షల మందితో జగనన్న సైన్యాన్ని తయారు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. జగనన్న 2.0 లో కార్యకర్తలతోనే పరిపాలన అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో తాము చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా చెప్పుకోలేకపోయామని తెలిపారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టలేకపోయామని వ్యాఖ్యానించారు.