ADB: ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 24న జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కాంగ్రెస్ నాయకులు శుక్రవారం తెలియజేశారు. ఈ సందర్భంగా మావల మండల కేంద్రంలోని PHC భవనం, సెంట్రల్ లైబ్రరీని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం బేల నుంచి గూడ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారని పేర్కొన్నారు.