SRPT: దేశాభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన జనగణన ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వచ్చే సిబ్బందికి ప్రజలు పూర్తి వివరాలు అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఓ కిషన్, శ్యామ్, మధు తదితరులు పాల్గొన్నారు.