NLG: ఉమ్మడి జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. రైలు కింద పడి శ్రవణ్, ఉరివేసుకుని శ్రీను, బస్సు ఢీకొని గణేష్, మంటల్లో చిక్కుకొని రైతు సత్తయ్య మరణించగా, వడదెబ్బతో వెంకటేశం, రాములు మృతి చెందారు. HYD కు చెందిన సయ్యద్ నీటిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటనలు అంగడిపేట, నాంపల్లి, సూర్యాపేట, కొత్తపల్లి చింతపల్లిలో జరిగాయి.