నెల్లూరు జిల్లా యాదవ ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ & అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31న పదో తరగతిలో 480కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు నాయకులు కాకు వెంగళరావు యాదవ్, శ్రీకుర్తి రవీంద్రబాబు యాదవ్ తెలిపారు. నెల్లూరులోని యాదవ్ భవన్లో నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులను ఘనంగా సత్కరించనున్నారు.