HYD: నల్గొండ జిల్లా తిరుమలగిరి నేతపురి ధన్సింగ్ తండాకు చెందిన గిరిజన యువతి మేగవత్ ప్రమీల పేద కుటుంబంలో జన్మించి కూలీ పనులు చేస్తూనే చదువులో రాణించారు. తన మాతృభాష అయిన బంజార భాషపై ప్రేమతో బంజారా భాషకు తెలుగులో రాసిన వర్ణనాత్మక వ్యాకరణం అంశంపై ఓయూ నుంచి PhD సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందింది.