WNP: గోపాల్ పేట ఎస్సై జగన్మోహన్ ఎస్పీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వనపర్తి పట్టణ 2వ ఎస్సై శశిధర్ వస్తున్నట్లు సమాచారం. గత జనవరిలోనే జగన్మోహన్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. అంతలోనే ఆయన మళ్లీ బదిలీ కావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.