AP: గుడివాడలో ఘోర కలియుగ వింత మోసం వెలుగుచూసింది. వెంకటేశ్వరస్వామి కోటి విలువైన కిరీటం రూ.38 లక్షలకే ట్రస్ట్ తాకట్టు పెట్టింది. 2025 జనవరిలో వృద్ధ దంపతులు దీన్ని ఆలయానికి దానం చేశారు. దాతల ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలయ ప్రెసిడెంట్ మోహనరావుపై కేసు నమోదు చేశారు. కాగా, తాకట్టు వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించారు.