ATP: జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈరోజు ఉదయం 8 గంటల వరకు జిల్లాలో 751 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా ఆత్మకూరు మండలంలో 72.4 మి. మీ, రాప్తాడులో 68.4 మి.మీ చొప్పున భారీ వర్షం పడింది. సింగనమల, తాడిపత్రి, గుమ్మగట్ట, రాయదుర్గం, కల్యాణదుర్గం, కంబదూరు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిశాయి.