ASF: తిర్యాణి MPDO కార్యాలయంలో శుద్ధజల యంత్రం అలంకారప్రాయంగా మారింది. కార్యాలయ సిబ్బందితో పాటు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. అయితే ప్రారంభించిన నాటి నుంచి ఒక్క రోజూ కూడా ఇది పనిచేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వస్తే తాగేందుకు నీరు లేక కొనుక్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.