JGL: మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-04 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురువారం ఘనంగా జరిగింది. పాఠశాల ఆవరణలో తమ గురువులను విద్యార్థులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. దశాబ్దాల తర్వాత ఒకరినొకరు కలుసుకుని, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు.