WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు పంచామృతాలతో అభిషేకాలు చేసి, విశేషంగా అలంకరించారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఉదయాన్నే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.