MDK: చేగుంట మండలం రెడ్డిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆమె అధికారులకు సూచించారు. వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డివో జయ చంద్రారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.