KNR: వీణవంక మండలంలో వరుస మేకల చోరీలకు పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శంకరపట్నానికి చెందిన సల్లావుద్దీన్, మొలంగూర్కు చెందిన పూర్ణచందర్, మల్లేశ్, శ్రీను కనపర్తి, చల్లూరు గ్రామాల్లో మేకలను దొంగిలించినట్లు గుర్తించారు. దీర్ఘకాల గాలింపుతో నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.