TPT: తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన సేవలు నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి 8 గంటల మధ్య సేనాధిపతి ఉత్సవం, గంగుండ్ర మండపంలో ఆస్థానం, యాగశాలలో శాస్త్రోక్త అంకురార్పణ కార్యక్రమాలు జరుగుతాయి.