TG: IAS అమోయ్ కుమార్కు ఈడీ సమన్లు జారీ చేసింది. భూదాన్ భూముల వ్యవహారంలో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. మనీలాండరింగ్ కోణంలో ఈ కేసు దర్యాప్తు జరగనుంది. 3 సేల్ డీడ్ వివరాలతో రావాలని ఆదేశించింది. మహేశ్వరం పీఎస్లో నమోదైన కేసుల ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులకు 42 ఎకరాలు కట్టబెట్టి అమోయ్ లబ్ధి పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి.