KMR: బీర్కూర్ మండలం బరంగెడ్ది వద్ద వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. నిందితులు రుద్రూర్, బోధన్ మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. మద్నూర్ మండలం నుంచి ముళ్ల పందులను కొనుగోలు చేసి బైకుపై అక్రమంగా తరలిస్తుండగా బాన్సువాడ అటవీ రేంజ్ అధికారి హబీబ్ ఆధ్వర్యంలో అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.