మన్యం: కొమరాడ మండలంలోని విక్రంపురం-డంగభద్ర గ్రామాల మధ్య ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం ఉదయం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని స్థానికులు కోరుతున్నారు.