TG: మాజీ ఐపీఎస్ భార్య హత్యకేసులో నేపాలీ గ్యాంగ్ కోసం స్పెషల్ సిట్ ఏర్పాటైంది. 20 మందితో సిట్ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ICCC ఐటీ సెల్ నుంచి సిట్ పని చేయనుంది. మాజీ IPS భార్య హత్య కేసుతో పాటు జవహర్నగర్ చోరీ కేసులో పరారీలో ఉన్న నేపాల్ గ్యాంగ్ కోసం పని చేయనున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.