VKB: ధారూర్ మండలంలోని గట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిన్న కురిసిన అకాల వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు సిద్ధం చేసిన వరి ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్ధతు ధరకే కొనాలని రైతులు కోరుతున్నారు.