శ్రీకాకుళం: ఎచ్చెర్లలలో ఆర్జీయూకేటీ 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు SSC రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ ఆచార్య అమరేంద్ర కుమార్ సాండ్రా సూచించారు. రీవెరిఫికేషన్ తర్వాత మార్కులు మారితే సవరించిన మార్కులనే సెలెక్షన్కు పరిగణిస్తామని తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా గడువులోపు (మే 30) దరఖాస్తు చేసుకోవాలని కోరారు.