WNP: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 25న హైదరాబాదులో మహా ధర్నా చేపట్టనున్నట్లు టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. గురువారం మహాలక్ష్మి ట్రేడర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా, లేబర్ కార్డును సరఫరా చేసి రెండు లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు.