WGL: జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యం కోసం “అన్ హిస్టరీ ఆఫ్ హెరిటేజ్ సైట్, టూరిస్ట్ ప్లేస్ కాంపిటీషన్ 2026” నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లాలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించి జియో ట్యాగ్ చేసిన సెల్ఫీలు, ఫోటోలను జూన్ 12 లోపు పంపాలని సూచించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు నగదు రూపంలో అందజేయనున్నారు.