AP: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై మంత్రి లోకేష్‌ను ఉద్దేశించి కేంద్ర మాజీమంత్రి చిదంబరం ట్వీట్ చేశారు. ఆర్టికల్ 81 మార్చకుండా డీలిమిటేషన్ చేస్తే దక్షిణ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఉత్తరాదికే లాభమని పేర్కొన్నారు. ఏపీకి సీట్లు పెరిగినా లోక్‌సభలో మొత్తం వాటా తగ్గుతుందని.. 50% సీట్ల పెంపు కేవలం భ్రమ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.