ATP: గుత్తిలో శుక్రవారం ఉరుముల, మెరుపులతో ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. గత వారం రోజులుగా ఉక్కుపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం రాకతో కాస్త ఉపశమనం లభించింది. మరోపక్క డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో రోడ్డుపై మురికినీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.