NZB: నగరంలోని మార్వాడి గల్లీ, మిర్చి కాంపౌండ్ ప్రాంతాల్లో మంచినీటి పైప్లైన్ లీకేజీని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి సమస్యను పరిశీలించిన ఆయన.. పాత పైప్లైన్కు శాశ్వత పరిష్కారం చూపించి కొత్త లైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు.