KDP: ఒంటిమిట్ట మండలంలోని వికలాంగులకు శుక్రవారం ఉచిత బస్ పాసులను పంపిణీ చేయనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. వికలాంగులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.