ADB: ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోథ్ MLA అనిల్ జాదవ్ శుక్రవారం సూచించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం పూట పనులను చేసుకోవాలని కోరారు. రైతులు, కూలీలు ఎండలో పనిచేసే సమయంలో తలపై తెల్లని గుడ్డను ధరించాలని తెలిపారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.