VKB: పూడూర్ మండల మిట్ట కంకల్ గ్రామస్తులు డాక్టర్ T రామ్మోహన్ రెడ్డి గారిని హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కొండా సురేఖ ప్రతి గ్రామంలో దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.