NLR: నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలికల ITI లో 2026 27 విద్యా సంవత్సరానికి ఆయా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITI ప్రిన్సిపాల్ ఏడుకొండలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, డ్రెస్ మేకింగ్ తదితర కోర్సులు ఉన్నాయన్నారు. ఈనెల 30 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.