ELR: మాదేపల్లిలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇండ్లగణన, వేడిగాలుల తీవ్రత, యువత నైపుణ్యాల గుర్తింపు తదితర అంశాలపై సిబ్బందితో సమీక్షించారు. ఇండ్లగణన కార్యక్రమం అత్యంత ప్రధానమైనదని, సచివాలయ సిబ్బంది దీనిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. వేడిగాలుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.