HYD: IPL ప్రేక్షకులకు మల్కాజ్గిరి పోలీసులు పలు సూచనలు చేశారు. నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉంటూ, అధికారిక ప్లాట్ ఫారమ్ ల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కనీసం గంట ముందే స్టేడియానికి చేరుకోవాలన్నారు. డిస్ట్రిక్ట్ యాప్‌లోని గూగుల్ మ్యాప్, స్టేడియంలోని సైన్ బోర్డులు, QR కోడ్ల ద్వారా సీట్ లొకేషన్‌ను సులభంగా గుర్తించవచ్చన్నారు.