JN: స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో లిక్విడ్ షాపులో ఈ నెల 16న జరిగిన చోరీ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ బార్మర్ జిల్లా సింది గ్రామానికి చెందిన భైర రామ్‌గా నిందితుడిని గుర్తించినట్లు సీఐ వేణు తెలిపారు. అతడిని గురువారం రాత్రి రిమాండ్ కుతరలించగా ఈ కేసులో పాల్గొన్న మిగిలిన నలుగురి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.