కోనసీమ: పి.గన్నవరం మండలానికి చెందిన ఓ బాలికను వేధింపులకు గురిచేస్తున్న ముమ్మడివరం రాజేశ్ (24)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గురువారం ఎస్సై శివకృష్ణ తెలిపారు. బాలికను రాజేశ్ లైంగికంగా వేధిస్తున్నాడని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై DSP సుంకర మురళీమోహన్ విచారణ చేస్తున్నారని వివరించారు.