KMM: ఈనెల 23 నుంచి 30 వరకు నిర్వహించనున్న భగత్‌సింగ్ వర్ధంతి సభలను జయప్రదం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ కోరారు. శుక్రవారం ఖమ్మంలోని జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్ ఆశయ సాధనకు విద్యార్థులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.