GDWL: ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకం లబ్ధి పొందాలంటే గడువులోగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని ఏఈఓ చందన పేర్కొన్నారు. గట్టు మండలం ఇందువాసి గ్రామంలో రైతు భరోసా దరఖాస్తుల ప్రక్రియపై ఆమె స్పష్టతనిచ్చారు. గ్రామంలో దాదాపు 102 మంది రైతుల దరఖాస్తులు ఇంకా పూర్తి కాలేదని, సమయం చాలా తక్కువగా ఉన్నందున రైతులు వెంటనే స్పందించాలని కోరారు.