NLG: యాసంగి వరి కోతలు ప్రారంభం కావడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 14 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు, గతంలో ఉన్న 375 కేంద్రాలను 400కు పెంచాలని నిర్ణయించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. అధికారుల కసరత్తుతో రైతులు హర్షం వ్యక్తమవుతోంది.