వేసవి అంటేనే ఉక్కపోత, చెమటలు, నీరసం. ఫలితంగా శరీరం త్వరగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఈ పరిస్థితిని అధిగమించి, వేసవిలోనూ హుషారుగా ఉండాలంటే పుచ్చకాయ, కర్బూజ, పైనాపిల్, పనస, జామ, ద్రాక్ష వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా శరీరానికి కావాల్సిన నీటితో పాటు మినరల్స్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి.